Rajinikanth’s autobiography I ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి తన ఆత్మకథ విడుదల చేస్తాను అని ప్రకటించారు. కరోనా టైంలో ఈ ముచ్చట చెప్పారు. ఆ తర్వాత దాని గురించి ఊసులేదు. తాజాగా ఆయన పాడ్ కాస్ట్ ప్లాన్ చేస్తున్నారు.
ఐతే, మరో అగ్ర కథానాయకుడు రజనీకాంత్ తన ఆత్మకథని మొదలుపెట్టారు. తమిళ సినిమా రంగంలో తన కెరీర్‌ను ప్రారంభించి, దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఆయన ఈ ఆటోబయాగ్రఫీ మొదలుపెట్టి చాలా కాలం అయిందట. ఆయన కుమార్తె సౌందర్య తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన తండ్రి ఇప్పుడు ఆత్మకథని రాయడంపైనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అని ఆమె తెలిపారు.
ఇది విడుదలైన తర్వాత “ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం” అవుతుందని ఆమె అన్నారు.
రజినీకాంత్ విలన్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ గా ఎదిగారు. సూపర్ స్టార్ గా ఇప్పటికీ తన స్థానాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా జైలర్, కూలి వంటి భారీ హిట్స్ ఇస్తున్నారు. తాజాగా ఆయన “జైలర్ 2” చిత్రంలో నటిస్తున్నారు.
రజినీకాంత్, లతా రజినీకాంత్ కి ఇద్దరు పిల్లలు.. ఐశ్వర్య, సౌందర్య. సౌందర్యకి పెళ్లి అయింది. ఒక కొడుకు. ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్ నుంచి విడిపోయింది. ఆమెకి ఇద్దరు కొడుకులు.
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…