నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వివిధ మాధ్యమాల్లో తన పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వాణిజ్య పరమైన ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ వేశారు. ఈ విషయాన్ని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలను జారీ చేసింది.
ఆదేశాల మేరకు ఎన్‌టీఆర్ గారి పేరు గానీ, “ఎన్‌టీఆర్”, “జూనియర్ ఎన్‌టీఆర్”, “తారక్” లాంటి పేర్లు గానీ, “యంగ్ టైగర్”, “మ్యాన్ ఆఫ్ మాసెస్” వంటి పేర్లు గానీ, అలాగే ఆయన ఫోటోలు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాణిజ్య పరంగా వాడితే చట్ట విరుద్దమని కోర్టు పేర్కొంది. ఎక్కడైనా ఇలా అనధికారంగా వాడినట్టు తెలిస్తే…చట్ట ప్రకారం వెంటనే తీసేయాలని ఆదేశాలను కోర్టు జారీ చేసింది.
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఇండియాలో పెద్ద సెలబ్రిటీ అని స్పష్టం చేసిన కోర్టు. ఎన్నో ఏళ్ల కెరీర్‌తో ఆయన ఈ మంచి పేరు సంపాదించుకున్నారని, ప్రజలకు ఆయన పేరు, ఫోటో, రూపం అంటే వెంటనే ఎన్‌టీఆర్ గారే గుర్తొస్తారని చెప్పింది. అందుకే ఆయన పేరు, ఇమేజ్ మీద హక్కులు ఆయనకే ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది.
ఒక వ్యక్తి పేరు, ఇమేజ్ వంటి వ్యక్తిత్వ హక్కులనేవి జీవించే హక్కు, స్వేచ్ఛతోనే కలిసి ఉంటాయని చెప్పిన ఢిల్లీ హైకోర్టు. ఇవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 కింద రక్షణ పొందుతాయని, అలాగే కాపీరైట్ చట్టం 1957, ట్రేడ్‌మార్క్ చట్టం 1999 ద్వారా కూడా అమలు చేయవచ్చని స్పష్టం చేసింది.
అదేవిధంగా ఇంటర్మీడియరీ ఫ్లాట్‌ఫామ్స్‌లో భాగమైన ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి వాటిని కూడా కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌ను 2021 ఐటీ రూల్స్ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) కింద అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, చట్టపరంగా కేటాయించిన సమయాల్లో దొరికిన హక్కుల ఉల్లంఘన లింక్‌లను తీసేయాలని కోర్టు తెలియజేసింది
కోర్టు మరో ఆదేశాన్ని కూడా ఇచ్చింది… దాని ప్రకారం ఎవరో గుర్తించని వ్యక్తులు, ఆన్‌లైన్ ట్రోల్స్ చేసేవాళ్ల, ఎవరికీ తెలియకుండా తప్పులు చేసేవాళ్లు ఎవరైనా ఎన్‌టీఆర్ గారి పేరు, ఫోటో, ఇమేజ్, గుర్తింపును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని, మెర్చండైజ్, డిజిటల్ కంటెంట్, మోర్ఫ్ చేసిన ఫోటోలు, AI కంటెంట్ లేదా ఏదైనా టెక్నాలజీ ద్వారా ఉపయోగించకూడదని ఆదేశించింది.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…