న్యూస్

Ram Charan: ఈసారి వివాదాలకు తావివ్వని రామ్ చరణ్

భోపాల్ లో జరిగిన ఈవెంట్ లో తెలియని భాష మాట్లాడి కన్ఫ్యూజ్ అయ్యాడు రామ్ చరణ్ (Ram Charan). హిందీలో మాట్లాడాలనే ఆయన ప్రయత్నాన్ని అంతా మెచ్చుకున్నప్పటికీ, ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని పొరపాట్లు ట్రోలింగ్ కు గురయ్యాయి. దీంతో మరోసారి ఆ తప్పు రిపీట్ చేయకూడదని చరణ్ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు.

ఢిల్లీలో జరిగిన ‘పెద్ది’ (Peddi) ప్రచార కార్యక్రమంలో పూర్తిగా ఇంగ్లిష్ కే పరిమితమయ్యాడు. అక్కడక్కడే హిందీ మాట్లాడ్డానికి ప్రయత్నించినప్పటికీ తిరిగి తన ఇంగ్లిష్ లోకే వచ్చేశాడు. యాంకర్ పదేపదే హిందీలోనే ప్రశ్నలు అడిగినప్పటికీ, చరణ్ మాత్రం ఓపిగ్గా ఇంగ్లిష్ లోనే సమాధానాలిచ్చాడు.

అలా వివాదాలకు తావు లేకుండా వ్యవహరించాడు చెర్రీ. భోపాల్ లో జరిగిన కార్యక్రమంలో.. భోపాల్ బదులు బిహార్ అని ప్రస్తావించాడు చరణ్. ఎక్కువగా కన్ఫ్యూజ్ అయి బుమ్రాను ఫుట్ బాల్ ఆటగాడిగా పేర్కొన్నాడు. తెలియని భాష మాట్లాడ్డం వల్లనే ఈ సమస్యలన్నీ వచ్చాయని గ్రహించి, ఢిల్లీలో పూర్తిగా ఇంగ్లిష్ కు పరిమితమయ్యాడు.

మరోవైపు భోపాల్ లో చరణ్ చేసిన పొరపాట్లకు ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తోంది.

TeluguCinema

Recent Posts

Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!

వెంకటేష్ (Venkatesh), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో రూపొందుతోన్న మొదటి చిత్రం…ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమా వేగంగా…

15 hours ago

Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి

రామ్ చరణ్ (Ram Charan) నటించిన "పెద్ది" (Peddi) సినిమా విడుదలై రెండు వారాలు అయిపోయింది. మూడో వారంలోకి ఎంట్రీ…

16 hours ago

Varanasi: లెక్కలు మారుతున్నాయా? ఇందులో నిజమెంత?

వారణాసి (Varanasi) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి (Rajamouli) తన రెగ్యులర్ శైలికి భిన్నంగా చాలా…

16 hours ago

Cocktail 2: పెళ్లి తర్వాత రష్మిక మందాన మొదటి రిలీజ్

రష్మిక మందాన (Rashmika Mandanna) ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొంది. హీరో విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లాడింది. పెళ్ళికి…

2 days ago

Daayra: కరీనా కపూర్ తో పృథ్వీరాజ్, డేట్ ఫిక్స్

మలయాళంలో పెద్ద హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). బాలీవుడ్ లో కూడా ఇంతకుముందు సినిమాలు…

2 days ago

OG 2: పవన్ కళ్యాణ్ కే ఇంకా సందేహం ఉందా?

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఐతే బీజేపీ - టీడీపీ స్కెచ్ లో…

2 days ago