దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)కి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఉగ్రం, కేజీఎఫ్, సలార్… ఈ మూడు సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు నీల్. అన్ని సినిమాలు ఒకే తీరుగా ఉంటాయి అనే విమర్శ కూడా ఉంది. కానీ నీల్ తనదైన శైలిలోనే తీసి భారీ పాన్ ఇండియా హిట్స్ ఇస్తున్నాడు.
ఇప్పుడు “డ్రాగన్”(Dragon)తో మరో భారీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మొదటి గ్లిమ్ప్స్ ఇటీవలే విడుదలఅయింది. ఫస్ట్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే చర్చ మొదలైంది.
“నా బాల్యం నా సినిమాల్లో ఎప్పుడూ ఒక భావోద్వేగంగా ఉంటుంది. ‘డ్రాగన్’లో కూడా అదే నా అతిపెద్ద బలం. నేను ఇప్పటివరకు చెప్పిన కథల కంటే ఇది మరింత వాస్తవికంగా ఉంటుంది. కథ ముంబై, కోల్‌కతా నగరాల నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఆ ప్రపంచం కూడా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది,” అని అసలు విషయాన్ని బయట పెట్టారు.
“నల్లమందు అక్రమ రవాణా చుట్టూ ఈ కథను అల్లాను. బ్రిటిష్ పాలన కాలంలో మొదలైన కొన్ని వ్యాపారాలు వారు వెళ్లిపోయిన తర్వాత కూడా కొనసాగాయి. అలాంటి వాస్తవ అంశాల ఆధారంగా ఒక బలమైన నాటకీయ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను. 1967 కాలాన్ని అత్యంత సహజంగా, వాస్తవికంగా తెరపై చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు నీల్.
హీరోయిన్లు ఈమధ్య సబ్ స్క్రిప్షన్ల మీద పడ్డారు. తమ ఇనస్టాగ్రామ్ ఎకౌంట్లకు చందాలు పెడుతున్నారు. మౌనీ రాయ్, సన్నీ లియోన్,…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పుకారు వైరల్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇది కూడా అలాంటిదే. అల్లు అర్జున్ (Allu…
'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వరప్రసాద్ గారు', 'భగవంత్ కేసరి'... ఈ మధ్య అనిల్ రావిపూడి (Anil Ravipudi) పెడుతున్న…
సినిమా హీరోలు భార్యలకు విడాకులు ఇవ్వడం చాలా కామనే. అలాగే రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు చాలామందే ఉన్నారు భారతీయ…
‘'బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోనికి (Vijay Antony) తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. భిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ…
దేశమంతా ఎండలు మండుతున్నాయి. చెన్నైలో ఇంకా ఎక్కువగా ఉక్కపోత ఉంది. దాంతో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) చెన్నై వాతావరణంలో…