దేశమంతా ఎండలు మండుతున్నాయి. చెన్నైలో ఇంకా ఎక్కువగా ఉక్కపోత ఉంది. దాంతో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) చెన్నై వాతావరణంలో ఉండలేక ఊటీకి షిఫ్ట్ అయ్యారు.
వానాకాలం చిరుజల్లు వచ్చి వాతావరణం చల్లబరిచే లోపు ఊటిలోనే ఉండేలా అక్కడికి వెళ్లిపోయారు. ఊటీలోని ఒక రిసార్ట్ లో ఉంటున్నారు. ఆ హోటల్ సిబ్బంది రజినీకాంత్ కి స్వాగతం పలుకుతున్న వీడియో వైరల్ అయింది.
75 ఏళ్ల రజినీకాంత్ ఇటీవల బాగా ట్రోలింగ్ కి గురి అయ్యారు. తమిళ అగ్ర నటుడు విజయ్ పార్టీ గెలిచింది కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కొన్ని సీట్లు తక్కువ వచ్చాయి. ఆ టైంలో విజయ్ సీఎం అవ్వకుండా రజినీకాంత్ తెరవెనుక మంత్రాగం నడిపి విఫలమైనట్లు సమాచారం. దాంతో, రజినీకాంత్ ని తమిళనాట అందరూ విమర్శించారు. విజయ్ ని చూసి రజినీకాంత్ కుళ్ళుకుంటున్నారు అనే కామెంట్ వచ్చింది.
ఆ వెంటనే రజినీకాంత్ మీడియాని పిలిచి తాను ఎలాంటి మంత్రాంగం చెయ్యలేదు అని వివరణ ఇచ్చారు. విజయ్ గెలుపు చాలా గొప్పది అని పేర్కొన్నారు. ఆ వివరణతో వివాదం ముగిసినా ఆయన తన వైఖరితో బాగా బ్యాడ్ అయ్యారు.
ఇక రజినీకాంత్ నటించిన “జైలర్ 2″(Jailer 2)కి ఇంకా విడుదల తేదీ ఫిక్స్ కాలేదు. కమల్ హాసన్ నిర్మాతగా రజినీకాంత్ హీరోగా ప్రకటించిన సినిమాకి ఇప్పటికే ఇద్దరు దర్శకులు మారిపోయారు. మూడో దర్శకుడు లైన్లోకి వచ్చాడు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…