‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘భగవంత్ కేసరి’… ఈ మధ్య అనిల్ రావిపూడి (Anil Ravipudi) పెడుతున్న టైటిల్స్ ఇలా కొత్తగా ఉంటున్నాయి. తన కొత్త సినిమాకు కూడా ఆ కొత్తదనాన్ని అలానే కొనసాగించాలనుకుంటున్నాడు రావిపూడి. వెంకటేశ్ (Venkatesh), కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోలుగా చేయబోయే సినిమాకు వినూత్నమైన టైటిల్ అనుకుంటున్నాడు.
సంక్రాంతి బరిలో నిలిచిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కొత్త చిత్రానికి ‘జనవరి 13 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ నేరుగా ఇలా విడుదల తేదీనే సినిమా టైటిల్ గా పెట్టేశాడు రావిపూడి.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. పైగా టైటిల్ కు కథకు కూడా ఏదో లింక్ ఉండే ఉంటుంది.
అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్, వెంకటేష్ వన్-మేన్ షో థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ సక్సెస్‌ఫుల్ కాంబో రిపీట్ అవుతోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. పక్కా ప్లానింగ్ తో 4 నెలల్లో 5 నెలల్లో ఫస్ట్ కాపీ బయటకు తీయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు దర్శకుడు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…