రామ్ చరణ్ (Ram Charan) నటించిన “పెద్ది” (Peddi) సినిమా విడుదలై రెండు వారాలు అయిపోయింది. మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఫలితం తెలిసిపోయింది. సో, రామ్ చరణ్ తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాలి.
“పెద్ది” ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 320 కోట్లు కొల్లగొట్టింది. ఆంధ్రప్రదేశ్ లో సూపర్ హిట్. తెలంగాణాలో యావరేజ్ గా నిలిచింది. హిందీలో ఫ్లాప్, నార్త్ అమెరికాలో ఘోరమైన నష్టాలు చూసింది. ఇలా ఒక్కో చోట ఒక్కో ఫలితాన్ని ఇచ్చి సో సో అనిపించుకొంది. ఇప్పుడు భారీ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన అవసరం ఉంది రామ్ చరణ్.
కొత్త సినిమా (RC17) లో మళ్ళీ కొత్తగా కనిపించేందుకు రామ్ చరణ్ సమాయత్తం అవుతున్నాడు.
ఐతే ఈ సినిమాలో ఎలా కనిపించాలి అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. సుకుమార్ ప్రస్తుతం ఇంకా స్క్రిప్ట్ రాస్తున్నారు. పూర్తిగా రాసిన తర్వాత చరణ్ ని ఎలా ప్రెజెంట్ చెయ్యాలి అనే విషయంలో సుకుమార్ ఒక ఆలోచన చేస్తారు. అప్పుడే రామ్ చరణ్ తన మేకోవర్ విషయంలో స్టైలిస్ట్ ల సాయం తీసుకొని సిద్ధం అవుతుంటారు.
ఐతే, గడ్డంతో కూడిన లుక్ కాకుండా ఈసారి తన స్టయిల్ ని కొంచెం మార్చాలని సుకుమార్ భావిస్తునట్లు సమాచారం. ఈ లోపు రామ్ చరణ్ తన చేతికి అయిన గాయం పూర్తిగా నయం అయ్యేలా సర్జరీ చేసుకొని వస్తారట. ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయ్యేసరికి ఈ ఏడాది పూర్తి అవుతుంది. అంటే 2027లో రామ్ చరణ్ ని కొత్త లుక్ లో చూస్తాం.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…