తెలుగు సినిమా రంగంలో సెంటిమెంట్స్ కి పట్టింపు ఎక్కువ. హీరో వెంకటేష్ కి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. అలాగే ఇల్లాలు ప్రియురాలు తరహా సినిమాలు చేస్తే హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఈ రెండు సెంటిమెంట్లు ఈ సారి వర్కౌట్ అయ్యాయి.
సరిగ్గా పాతికేళ్ల కిందట 2000 సంవత్సరం జనవరి 14న వెంకటేష్ నటించిన ‘కలిసుందాం రా’ సినిమా వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
మళ్లీ ఇన్నేళ్లకు అదే తేదీకి, సంక్రాంతి కానుకగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వచ్చింది. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనరే. ఇది ఇప్పుడు ఫుల్లుగా ఆడుతోంది. ఈ సంక్రాంతికి ఇదే బిగ్ హిట్ అయ్యేలా కనిపిస్తోంది. మొదటి రెండు రోజులు ఈ సినిమా అదరగొట్టింది. ఫైనల్ గా ఏ రేంజ్ లో నిలుస్తుందో చూడాలి.
వెంకటేష్ ఇంతకుముందు “ఇంట్లో ఇల్లాలు ప్రియురాలు”, “సుందరకాండ” వంటి ఇద్దరు భామల చిత్రాలు చేసి విజయాలు అందుకున్నారు. ఇందులో కూడా వెంకీకి భార్యగా ఐశ్వర్య రాజేష్, ప్రియురాలిగా మీనాక్షి చౌదరి నటించారు. ఈ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకి వర్కౌట్ అయింది.
అలియా భట్ (Alia Bhatt) నటించిన మొదటి యాక్షన్ చిత్రం.. ‘ఆల్పా’ (Alpha). ఇండియాలో ఇంతకుముందెప్పుడూ హీరోయినే స్పైగా ప్రధాన…
"పెద్ది" (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కానీ ఆ సినిమా విడుదలైన…
ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగునాట సరికొత్త రాజకీయ రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.…
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…