బ్యాక్ ఎంతున్నా సరిపోదు: శృతి

ప్రస్తుతం బాలీవుడ్ లో జోరుగా నడుస్తున్న నెపొటిజంపై హీరోయిన్ శృతిహాసన్ కూడా స్పందించింది. బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో అవకాశం రావడం చాలా ఈజీ అనే విషయాన్ని ఒప్పుకుంది శృతి. కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే నెపొటిజం పనిచేయదంటోంది. బ్యాక్ ఎంత సపోర్ట్ ఉన్నా… ఒకసారి పరిచయం అయ్యాక పడాల్సిన కష్టం వేరు అంటోంది ఈ భామ. 

“నేను పెరిగిన వ్యక్తుల కారణంగా, నా తల్లిదండ్రుల కారణంగా పరిశ్రమలో నాకు తలుపులు తెరిచినట్లు నేను అంగీకరించాలి. నా ఇంటిపేరు కారణంగా నాకు అవకాశాలు వచ్చాయి. దానిని నేను కాదనలేను. కానీ నేను జీవితంలో ఏదైనా స్లోగా నేర్చుకునే రకం. నాకు సరైన కమ్యూనికేషన్ మార్గం కూడా తెలియదు. సరైన వ్యక్తులను ఎలా చేరుకోవాలో తెలియదు. ఇంకా చెప్పాలంటే నాకున్న ప్రత్యేక అర్హతల వల్ల నాకు ఈజీగా అవకాశం వచ్చింది. కానీ దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం.”

కేవలం బ్యాక్ గ్రౌండ్ తో ఏ ఇండస్ట్రీలో రాణించలేం అంటోంది శృతిహాసన్. టాలెంట్ కూడా ఉన్నప్పుడే పరిశ్రమలో ఎవరైనా నిలదొక్కుకుంటారని చెబుతోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన “యారా” అనే హిందీ సినిమా రేపు జీ5లో రిలీజ్ అవుతోంది.

TeluguCinema

Recent Posts

ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh

ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలతో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే…

10 hours ago

ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్న Nagarjuna

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన "లెనిన్" (Lenin) చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి,…

15 hours ago

అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela

ఇప్పటికే లవ్ లైఫ్, పెళ్లి, డేటింగ్ లాంటి అంశాలపై ఓపెన్ గా స్పందించింది శ్రీలీల (Sreeleela). ఎప్పుడూ పక్కనే అమ్మ…

15 hours ago

ఆ సినిమా రిజెక్ట్ చేశాను: Bhagyashri Borse

'ఎల్లమ్మ' (Yellamma) సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అనుకున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి పేరు తెరపైకొచ్చింది.…

15 hours ago

Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త

సోషల్ మీడియాలో హీరోయిన్లపై పడే కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా అంగాంగాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది.…

2 days ago

వేరే వాళ్ళు వేసుకున్న బట్టలు Trishaకి పంపారా?

మనం ఒక మాల్ కి వెళ్ళినప్పుడు బట్టలు సెలెక్ట్ చేసుకొని ట్రయిల్ చేస్తాం. నచ్చినవే తీసుకుంటాం. మరి మనం ట్రయిల్…

2 days ago