Categories: న్యూస్

గ్యాప్ తీసుకోలేదు, ఇచ్చారు

తను టాలీవుడ్ కు దూరమవ్వలేదంటున్నాడు గాయకుడు సిద్ శ్రీరామ్. తన దగ్గరకొచ్చిన సాంగ్స్ నుంచి, మనసుకు నచ్చిన పాటలు పాడుతూనే ఉన్నానని తెలిపాడు. పెద్ద బ్యానర్లు, పెద్ద సంగీత దర్శకుల నుంచి తనకు పెద్దగా అవకాశాలు రావడం లేదనే వాదనను తోసిపుచ్చాడు.

‘పుష్ప’ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్, ఛార్జ్ బస్టర్ గా నిలిచింది. అయితే ‘పుష్ప-2’లో మాత్రం సిద్ శ్రీరామ్ గొంతు వినిపించలేదు. దీనిపై స్పందించడానికి సిద్ శ్రీరామ్ నిరాకరించాడు. ఆ విషయాన్ని మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నే అడగాలన్నాడు.

అమెరికా నుంచి వచ్చి, హైదరాబాద్-చెన్నైలో పాటలు పాడి తిరిగి అమెరికా వెళ్లిపోయే ఈ సింగర్.. తన గాత్రంపై వస్తున్న విమర్శల్ని పట్టించుకోనంటున్నాడు. తెలుగు పదాల్ని సరిగ్గా ఉచ్ఛరించననే కామెంట్స్ తన వరకు రాలేదంటున్నాడు. తనకు ఓ ఏడాది టైం ఇస్తే, తెలుగులో అనర్ఘలంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు.

హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు సిద్ శ్రీరామ్. ఇందులో తన సూపర్ హిట్ సాంగ్స్ తో పాటు.. 80-90 దశకాల్లో వచ్చిన మెలొడీ సాంగ్స్ ను తన గొంతుతో వినిపించబోతున్నాడు.

Admin

Recent Posts

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

3 hours ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

4 hours ago

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

23 hours ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

24 hours ago

Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను

లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…

1 day ago

NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్

ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…

1 day ago