ఎప్పుడూ నవ్వుతూ కూల్ గా కనిపించే హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరు. వివాదాలకు దూరంగా కెరీర్ కొనసాగించడంతో పాటు, అందరితో ఒకే రకమైన రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తూ వస్తోంది. ఇలాంటి నటికి కూడా ఇప్పుడు కోపమొచ్చింది.
ఇకపై తనపై ఇష్టమొచ్చినట్టు రాతలు రాస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చింది సిమ్రాన్. ఏది మంచి, ఏది చెడు అనేది తనకు తెలుసని, మరీ ముఖ్యంగా ఓ మహిళగా తన పరిధి ఏంటనేది కూడా తనకు తెలుసని చెప్పుకొచ్చింది. తనపై పుకార్లు వ్యాపింపజేస్తున్న వాళ్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. సిమ్రాన్ ను హీరో విజయ్ తిరస్కరించాడంటూ ఓ పత్రిక పెద్ద కథనం రాసుకొచ్చింది. విజయ్ తో సినిమా నిర్మించేందుకు సిమ్రాన్ ప్లాన్ చేసిందట, డేట్స్ కోసం అతడ్ని సంప్రదించిందంట. ఆ ప్రతిపాదనను విజయ్ తిరస్కరించాడనేది కథనం. దీనిపై సిమ్రాన్ భగ్గుమంది.
వివిధ సందర్భాల్లో సోషల్ మీడియాలో తన పేరు తప్పుగా ప్రస్తావనకొచ్చినప్పటికీ తను సైలెంట్ గా ఉన్నానని, కానీ ఇకపై తను నిశ్శబ్దంగా ఉండనని, తన ఆత్మగౌరవం తనకు ముఖ్యమని, తనపై పుకార్లు రాయొద్దని కోరింది.
ఈ సందర్భంగా మరో కీలకమైన అంశంపై కూడా క్లారిటీ ఇచ్చింది. పెద్ద హీరోలతో నటించాలని తహతహలాడడం లేదని, చాలామంది స్టార్ హీరోలతో నటించానని, ప్రస్తుతం తన లక్ష్యాలు వేరని స్పష్టం చేసింది.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…