హీరో శ్రీవిష్ణు ప్రతి సినిమాలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడు. “ఓం భీం బుష్” సినిమాలో ఒక మగ దెయ్యం అతన్ని ప్రేమిస్తుంది. ఇక ఆయన గత చిత్రంలో శ్రీవిష్ణు అనేక పాత్రలు పోషించాడు. అందులో ఒక కీలకమైన పాత్ర… ట్రాన్స్ జెండర్. ఐతే, దాన్ని జనం జీర్ణించుకోలేదు. సినిమా ఘోరంగా పరాజయం పాలు అయింది.
ప్రస్తుతం “సింగిల్” అనే సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న శ్రీ విష్ణు “స్వాగ్” విషయంలో చేసిన తప్పు గురించి మాట్లాడాడు.
“సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో స్వాగ్ కూడా ఫుల్లుగా కామెడీతో ఉంటుంది అని జనం భావించారు. కానీ జనం థియేటర్లోకి వచ్చాక వాళ్ల అంచనాలకు, సినిమా కంటెంట్ కి ఉన్న మిస్ మ్యాచ్ తో ఇబ్బంది పడ్డారు. కథ విషయంలో, ఎలాంటి సినిమా అనే విషయంలో జనాలకు ముందే చెప్పడంలో మేం ఫెయిల్ అయ్యాం. జనాలని ముందే ప్రిపేర్ చేసి ఉంటె ఫలితం వేరుగా ఉండేది. ఆ తప్పు చేసి ఉండకపోతే సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేది,” అని శ్రీ విష్ణు తెలిపారు.
“ప్రయోగం చేసినప్పుడు అది ఫలితాన్ని ఇవ్వకపోతే అది ఒక అనుభవంగా, ఒక పాఠంగానే చూస్తాను. వర్క్ కాకపోయినా కొత్త ప్రయత్నం మానకూడదని నా అభిప్రాయం,” అని క్లారిటీ ఇచ్చారు శ్రీవిష్ణు.
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…