దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు కోపం వచ్చింది. తన సినిమా టైటిల్ ను లీక్ చేయడమే కాకుండా, ఆ నెపాన్ని తన డిపార్ట్ మెంట్ పైకి కొంతమంది నెట్టడంతో ఈ దర్శకుడు ఫైర్ అయ్యాడు.
నానితో రెండో సినిమాకు రెడీ అయ్యాడు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్’ (The Paradise) అనే టైటిల్ అనుకున్నారు. అయితే వీళ్లు ప్రకటించకముందే కొంతమంది టైటిల్ లీక్ చేశారు. పైగా రైటింగ్ డిపార్ట్ మెంట్ నుంచే లీక్ అయిందంటూ కథనాలిచ్చారు. దీనిపై శ్రీకాంత్ సీరియస్ అయ్యాడు.
“నా సినిమాకే కాదు, ఎవరి సినిమాలో ఏది లీక్ అయినా అసిస్టెంట్ డైరక్టర్స్ లేదా రైటర్స్ ను బ్లేమ్ చేయడం మానేస్తే మంచిది. సినిమా కోసం నిశ్వార్థంగా సేవలందిస్తోంది వీళ్లే. అంతేకాదు, భవిష్యత్ క్రియేటర్స్ వీళ్లు. ఇలాంటి వాళ్లకు గౌరవం ఇవ్వాలి. ఇండస్ట్రీలో కష్టపడి పనిచేసే ఇలాంటి డిపార్ట్ మెంట్ పై నిందలు వేయడం మానుకోవాలి.”
ఇలా రైటింగ్ డిపార్ట్ మెంట్ ను వెనకేసుకొచ్చాడు ఓదెల. తన సినిమా టైటిల్ ను లీక్ చేసింది ఎవరో తనకు తెలుసని, ఇకపైనా నెపాన్ని మరోకరిపై నెట్టే పనులు మానుకోవాలని ఘాటుగా హెచ్చరించాడు.
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…