చిన్న సినిమాకు పెద్ద ప్రశంస దక్కింది. ‘క’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాను రీసెంట్ గా చూశారు చిరు. సినిమా బాగా నచ్చింది.
వెంటనే హీరో, దర్శకులు, నిర్మాతను తన ఇంటికి ఆహ్వానించారు. సినిమాను మెచ్చుకుంటూ వాళ్లను ప్రత్యేకంగా అభినందించారు. ఏకంగా గంట సేపు వాళ్లతో మాట్లాడి సినిమా విశేషాల్ని పంచుకున్నారు. అభినందించడంతో పాటు మంచి ఆతిథ్యం కూడా అందించారు.
చిన్న సినిమాకు ఎప్పుడూ చిరంజీవి మద్దతు ఉంటుంది. మెగాస్టార్ మద్దతుతో థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ తను ప్రచారం చేయకపోయినా, రిలీజైన తర్వాత ఏదైనా చిన్న సినిమా సక్సెస్ అయితే, వాళ్లను అభినందించడం చిరంజీవికి అలవాటు.
ఈసారి కూడా చిరు అదే పని చేశారు. కిరణ్ అబ్బవరం అండ్ కో ను అభినందించారు. మెగా ప్రశంసతో యూనిట్ ఉబ్బితబ్బిబ్బయింది.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…