ఇలా ఓ సినిమా ప్రకటించిన వెంటనే అలా గాసిప్స్ పుట్టుకురావడం సర్వ సాధారణం. రామ్ గోపాల్ వర్మ విషయంలో కూడా ఇలానే జరిగింది. తను పూర్తిగా మారిపోయానని, తను తీసిన ‘సత్య’ సినిమా చూసిన తర్వాత జ్ఞానోదయం అయిందంటూ చాలా చెప్పుకొచ్చాడు వర్మ.
అలా ప్రకటించిన మరుసటి రోజే కొత్త సినిమా ప్రకటించాడు. దానికి ‘సిండికేట్’ అనే టైటిల్ కూడా పెట్టాడు. చూచాయగా స్టోరీలైన్ కూడా వెల్లడించాడు. ‘జంతువుల కంటే క్రూరమైన మనుషులు’ అనే ట్యాగ్ లైన్ కూడా ప్రకటించాడు.
ఇంత జరిగిన తర్వాత గాసిప్ రాయుళ్లు ఊరుకుంటారు. వాళ్లు తమదైన శైలిలో రెచ్చిపోయారు. ‘సిండికేట్’ లో వెంకటేశ్ నటిస్తున్నాడని.. కీలక పాత్రల్లో బిగ్ బి, ఫహాద్ ఫాజిల్, పృధ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారంటూ రాసుకొచ్చాడు.
అది కాస్తా వైరల్ అవ్వడంతో, వర్మ మరోసారి రంగంలోకి దిగాడు. ఓ సెక్షన్ మీడియాలో నడుస్తున్న ప్రచారంలో నిజం లేదని, అదంతా ఫేక్ అని ప్రకటించాడు. త్వరలోనే నటీనటుల వివరాలను తానే ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు. అదీ సంగతి.
'మల్లేశం', 'వకీల్ సాబ్' సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే 'మిరాయి' సినిమాతో…
ఒక వయసు వచ్చిందంటే చాలు, పెళ్లెప్పుడు అని అడిగే సమాజంలో ఉన్నాం. అసలు పెళ్లి ఎందుకు, ఇలా సోలోగా ఉండలేమా…
వెంకటేష్ (Venkatesh), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో రూపొందుతోన్న మొదటి చిత్రం…ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbam). ఈ సినిమా వేగంగా…
రామ్ చరణ్ (Ram Charan) నటించిన "పెద్ది" (Peddi) సినిమా విడుదలై రెండు వారాలు అయిపోయింది. మూడో వారంలోకి ఎంట్రీ…
వారణాసి (Varanasi) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రాజమౌళి (Rajamouli) తన రెగ్యులర్ శైలికి భిన్నంగా చాలా…