ఇప్పుడు అంతటా ధురంధర్ 2 (Dhurandhar 2) గురించే చర్చ. మన తెలుగు హీరోలే కాదు టాప్ డైరెక్టర్ రాజమౌళి కూడా రోజు సినిమాని పొగుడుతూ ట్వీట్ చేశారు. సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతోంది. హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలుస్తోంది. ఇంత పెద్ద హిట్ వచ్చినా, ఆయన భార్య, హీరోయిన్ దీపిక (Deepika Padukone) సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది.
సాధారణంగా స్టార్ దంపతులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ పోస్టులు పెడుతుంటారు. కానీ ఈసారి దీపిక నుంచి అలాంటి స్పందన కనిపించలేదు.
మరోవైపు ప్రీమియర్ షోకి కూడా దీపిక వెళ్ళలేదు. ఐతే నిన్న ఒక ఈవెంట్ కి మాత్రం రణ్వీర్ సింగ్ తల్లి, తన అత్తయ్యతో కలిసి వెళ్లారు. కానీ ఎక్కడా “ధురంధర్ 2” గురించి మాటలాడలేదు.
దీపిక నిశ్శబ్దం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవలే తల్లిగా మారిన దీపిక పదుకొనె అటు తల్లిగా తన బాధ్యతలు నెరవేరుస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది. తన రెండో ఇన్నింగ్స్ లో రెండు సినిమాలు ఒప్పుకొంది. ఒకటి అల్లు అర్జున్ నటిస్తోన్న దర్శకుడు అట్లీ తీస్తున్న సినిమా. మరోటి షారుఖ్ ఖాన్ నటిస్తోన్న “కింగ్.”
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…
ఒక నటిగా కెరీర్‌లో ఎదురయ్యే ఒడిదొడుకులు, కష్టకాలమే ఓపికను, తనపై తనకు నమ్మకాన్ని నేర్పించిందని చెబుతోంది హీరోయిన్ త్రిప్తి దిమ్రి…
కొందరికి అదృష్టం అలా పట్టేస్తుందంతే. రావడమే హిట్లు మీద హిట్లు కొడతారు, వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ లో…