ఈ రోజు రంజాన్ పండుగ. రేపటి నుంచి ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) మళ్ళీ తన పాత పద్దతిలోనే పూర్తిగా వర్క్ చేస్తారు. సాధారణంగా రెహమాన్ రంజాన్ టైంలో తక్కువ టైం పని చేస్తుంటారట. ఎందుకంటే ఆయన ఉపవాస దీక్షలో ఉంటారు. పండుగ పూర్తిగా కాగానే మళ్ళీ పూర్తి స్థాయిలో పని మొదలుపెడతారు.
ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన “పెద్ది” (Peddi) సినిమాకి నేపథ్య సంగీతం పూర్తి చెయ్యాలి. ఆయన తన వర్క్ పూర్తి చేస్తేనే ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల అవుతుంది. ఏప్రిల్ 29న ప్రీమియర్ షోలు పడుతాయి. అంటే, అంతకు వారం రోజుల ముందే రెహమాన్ తన వర్క్ అంతా పూర్తి చెయ్యాలి. ఆ లెక్కన చూస్తే సరిగ్గా నెల రోజుల టైం ఉంది రెహమాన్ తన పని పూర్తి చేసేందుకు.
నెల రోజుల్లో ఆయన సులువుగా తన పని కానిచేస్తారు. అందుకే, “పెద్ది” వాయిదా పడబోతోంది అనే పుకార్లను టీం తోసిపుచ్చుతోంది. అన్ని పనులు జరుగుతున్నాయి అనీ, అనుకున్న టైంకే విడుదల చేస్తామని ధీమాగా చెప్తోంది టీం.
. ఇంకా షూట్ పూర్తి కాలేదు. రెహమానేమో రంజాన్ టైంలో పెద్దగా పని చేయరు. ఆల్రెడీ పూర్తయిన సన్నివేశాలకు కూడా ఇంకా బీజీఎం పూర్తి చేయలేదని తెలుస్తోంది.
ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన రెండు పాటలు ఇప్పటివరకు విడుదల అయ్యాయి. రెండూ బాగా పాపులర్ అయ్యాయి.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…