ప్రస్తుతం దేశమంతా బాహుబలి-2 మేనియా కొనసాగుతోంది. టాలీవుడ్ లో అయితే ఈ సినిమా తప్ప మరో మూవీ కనుచూపు మేరలో లేదు. అటు బాలీవుడ్ లో మాత్రం రేపట్నుంచి మరో మూవీ సందడి చేయబోతోంది. అదే సర్కార్ 3. బిగ్ బి అమితాబ్ నటించిన ఈ సినిమా బాహుబలి-2 నుంచి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంటుందా.. బిగ్ బి-వర్మ కలిసి బాహుబలి మేనియాను అడ్డుకోగలరా…
గతంలో బిగ్ బి, వర్మ కాంబోలో వచ్చిన సర్కార్ సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాతొచ్చిన సీక్వెల్స్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. మళ్లీ స్మాల్ గ్యాప్ తర్వాత సర్కార్-3 వస్తోంది. అవే పాత్రలు, అవే షేడ్స్, అదే బ్యాక్ డ్రాప్, అవే ఫ్రేమింగ్స్… అన్నీ యాజ్ ఇటీజ్. కాకపోతే ఈసారి వర్మ ఏదో మేజిక్ చేస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది బాలీవుడ్. ఇదే ఆశ అమితాబ్ లో కూడా కనిపిస్తోంది.
బాహుబలి-2 నుంచి జనాల్ని మళ్లించేందుకు ప్రమోషన్ కూడా ఎగ్రెసివ్ గా చేశారు. ఏకంగా అమితాబ్ ను వర్మ ఇంటర్వ్యూ చేయడం, తనదైన స్టయిల్ లో క్వశ్చన్స్ అడగడం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. మరి థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా వర్మను మరోసారి నిలబెడుతుందా.. లేక వర్మ అస్సలు మారలేదని మరోసారి ప్రూవ్ చేస్తుందా.. అసలు బాహుబలి-2 నుంచి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకోగలుగుతుందా… లేదా.. లెట్స్ వెయిట్ అండ్ సీ..
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…