Advertisement
తెలుగు న్యూస్

హైదరాబాద్ లో 90 చిత్రాలు


తమిళనాడులో మళ్ళీ లాక్డౌన్ రెండు వారాల పాటు పొడిగించారు. కేరళలో కేసులు పెరుగుతున్నాయి. కర్ణాటకలో కూడా సినిమా థియేటర్లు ఓపెన్ కాలేదు. దాంతో అన్ని సినిమా రంగాల నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు మళ్ళీ హైదరాబాద్ కి మకాం మార్చారు.

ప్రస్తుతం హైదరాబాద్ లోని వివిధ స్టూడియోల్లో, ఇతర లొకేషన్లలో జరుగుతున్న షూటింగులు దాదాపు 90 వరకు ఉన్నాయట. ఇందులో తెలుగు సినిమాలు, మలయాళ చిత్రాలు, తమిళ చిత్రాలు, హిందీ సినిమాలున్నాయి. అలాగే వెబ్ సిరీస్ లు, టీవీ సీరియళ్ల షూటింగ్ రెగ్యులర్ గా ఉండవే. ఇవన్నీ కలిపితే 90 వరకు ఉన్నాయట.

నటులకు కావాల్సిన వ్యానిటి వ్యాన్లు దొరకడం కష్టంగా మారిందట.హైదరాబాద్ లో షూటింగ్ లు జోరు అందుకోవడానికి మరో కారణం … ఫైవ్ స్టార్ హోటల్స్ అన్ని భారీగా రేట్స్ తగ్గించాయి. కోవిడ్ వల్ల వాటి వ్యాపారం దెబ్బతింది. దాంతో, సినిమా యూనిట్స్ కి రిబేట్స్ ఇస్తున్నాయి స్టార్ హోటల్స్ దాంతో, గత రెండు వారాల్లో హోటల్స్ అన్ని మళ్ళీ సూపర్ బిజినెస్ చూస్తున్నాయి.

తెలుగునాట ప్రస్తుతం సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ, ఇతర భాషల్లో మాత్రం థియేటర్ల విడుదలలు ఇంకా స్టార్ట్ కాలేదు. ఎక్కువగా అక్కడ ఓటిటిని దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ సాగిస్తున్నారు.

Advertisement

This post was last modified on August 7, 2021 10:37 pm

Advertisement
Share