Advertisement
తెలుగు న్యూస్

ఆ హీరోయిన్ వల్ల రవితేజకు భార్యతో గొడవలయ్యాయట

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఓ స్థాయికి ఎదిగిన హీరోల్లో రవితేజ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. దొరికిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటూ చక్కగా ఎదిగారు. ఆయన సినీ ప్రస్థానం మాత్రం అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలైంది. ఆ తర్వాత చిన్న చిన్న అవకాశాలు.. ఆ తర్వాత హీరోగా మారి ‘ఇడియట్’ మూవీతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఆ మధ్య వరుస ఫ్లాపులతో రవితేజ ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆ తరువాత మాత్రం తిరిగి ‘రాజా ది గ్రేట్’ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక అంతే మళ్లీ రవితేజ స్థానానికి ఇండస్ట్రీలో ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. అయితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూమర్ అయితే ఎదుర్కొని ఉంటారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. రవితేజపై కూడా ఒకానొక టైంలో ఓ రూమర్ నడిచింది. 

రవితేజ.. స్టార్ హీరోయిన్ అనుష్కతో డేటింగ్‌లో ఉన్నారని.. వారిద్దరూ ముంబైలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో ఉంటూ కెమెరాలకు చిక్కారని అప్పట్లో ఒక రూమర్ దుమ్మురేపింది. అనుష్క కారణంగా రవితేజ ఇంట్లో కూడా గొడవలు అయ్యాయని ప్రచారం జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. వీరిద్దరూ కలిసి నటించిన విక్రమార్కుడు మూవీ తర్వాత ఓ ింటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ… తనకు ఇష్టమైన హీరోయిన అనుష్క అని.. ఆమె తనకి మంచి స్నేహితురాలని చెప్పాడు. అంతే రచ్చ స్టార్ట్.

ఇవీ చదవండి:

అమీషా నీతి సూక్తులు

భోళాశంకర్ కి అడ్వాంటేజ్ అవుతుందా

మహేష్ బాబుపై పూజ గరం!

మాస్ మహారాజ్ దూకుడు

Advertisement

This post was last modified on July 8, 2023 9:21 am

Advertisement
Share