అమీషా నీతి సూక్తులు

Ameesha Patel

అమీషా పటేల్ కూడా నీతి సూక్తులు చెప్తోంది. 48 ఏళ్ల అమీషా పటేల్ ఇన్ స్టాగ్రామ్ నిండా ఆమె అందాల ఆరబోత ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లోనే కాదు కొంతకాలం క్రితం ఆమె ఫుల్లుగా ఎక్స్పోజింగ్ చేసింది అనేక చిత్రాల్లో. ఈ భామ కూడా ఓటిటి నిండా అసభ్యత ఉంది అని కుటుంబ సభ్యులతో చూడలేకపోతున్నాం అని వాపోతోంది.

ఓటిటి షోలలో శృతిమించిన శృంగార సన్నివేశాలు, బూతులు ఉంటున్న మాట వాస్తవమే. కానీ, ఇలాంటివి తీయకూడదు అన్నట్లుగా అమీషా మాట్లాడడం మాత్రం దెయ్యాలు నీతులు వల్లిస్తున్నట్లుగా ఉంది అనక తప్పదు.

అమీషా పటేల్ తాజాగా ‘గదర్ 2’ సినిమాలో నటించింది. ఆమె కెరీర్ లో అతిపెద్ద హిట్ చిత్రం అది. 2001లో విడుదలైంది ‘గదర్’. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్ తీశారు. ఈ సీక్వెల్ ప్రమోషన్ లో భాగంగా ఆమె ఈ కామెంట్స్ చేసింది. హీరోయిన్లు తనలా ‘గదర్’ వంటి సినిమాల్లో నటించాలని, ఒద్దికగా కనిపించాలని నేటి తరం హీరోయిన్లకు సూక్తులు చెప్తోంది.

తెలుగులో బద్రి, నాని, నరసింహుడు, పరమవీర చక్ర, ఆకతాయి వంటి సినిమాల్లో నటించింది అమీషా.

Advertisement
 

More

Related Stories