పెళ్లి తర్వాత మార్పు ఏమి లేదు?

రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పెళ్లాడింది. తన ప్రియుడిని పెళ్లి చేసుకొంది. పెళ్లి తర్వాత సాధారణంగా కొత్త జంట హానీమూన్ వెళ్తుంటారు. కానీ రకుల్, ఆమె భర్త జాకీ భగ్నానీ ఇంకా హనీమూన్ కి వెళ్ళలేదు.

ఇటు రకుల్, అటు ఆమె భర్త జాకీ ఇద్దరూ ఎవరి పనిలో వారు పడ్డారు. రకుల్ సినిమాలు చేస్తోంది. యాడ్స్, ఫ్యాషన్ షోల్లో పాల్గొంటోంది.

ఇక ఆమె భర్త అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లతో నిర్మించిన “చోటేమియా బడేమియా” విడుదలకు సిద్ధమైంది. దాంతో ఆ పనిలో బిజీగా ఉన్నాడు. అందుకే ఇద్దరూ హానీమూన్ ని వాయిదా వేసుకున్నారు.

అందుకే పెళ్లి తర్వాత తమ జీవితాల్లో పెద్దగా మార్పు లేదు అని అంటోంది రకుల్. పెళ్లికి ముందే చాలా ఏళ్ళు ప్రేమించుకోవడం వల్ల తమకు మ్యారీడ్ లైఫ్ కొత్తగా అనిపించడం లేదు అని చెప్తోంది.

 

More

Related Stories