మా అమ్మకి పెళ్లి చేస్తా: సుప్రీత

Surekha Vani

సురేఖావాణి కూతురు తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. మమ్మీకి మళ్ళీ పెళ్లి చేస్తా అని ఈ అమ్మడు స్టేట్మెంట్ ఇచ్చింది.

సురేఖావాణి కూతురు సుప్రీతా బండారు ప్రస్తుతం హీరోయిన్ గా మొదటి సినిమా చేస్తోంది. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడింది. తన తల్లి తన కోసం చాలా త్యాగం చేసింది అని ఆమెకి మళ్ళీ పెళ్లి చెయ్యాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పుకొచ్చింది.

సురేఖావాణి భర్త ఇటీవల మరణించారు. అఫ్కోర్స్ ఆయన మరణానానికి చాలా ఏళ్ల క్రితం భార్యాభర్తలు విడివిడిగా ఉన్నారు. కాకపోతే విడాకులు తీసుకోలేదు. భర్త చనిపోక ముందునుంచే ఆమె తన కూతురితో కలిసి ఉంటోంది. ఇప్పుడు కూతురు హీరోయిన్ కావడంతో సురేఖ ఇటీవల తన మొక్కు తీర్చుకొంది. తిరుపతి వేంకటేశ్వరుడికి తలనీలాలు అర్పించింది.

తనకు పెళ్లి అయితే భర్తతో ఉండాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు తన తల్లి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అనే భావనతో తన పెళ్లి కన్నా ముందే తల్లికి పెళ్లి చేస్తా అని అంటోంది సుప్రీత. మరి సురేఖావాణి మాట ఏంటో?

Advertisement
 

More

Related Stories