‘రామాయణ’ పేరుతో బాలీవుడ్ దర్శకుడు నితీష్ తీస్తున్న ‘రామాయణం’ షూటింగ్ మొదలైంది. ఇప్పటివరకు ఎన్నో రామాయణ చిత్రాలు భారతీయ భాషల్లో వచ్చాయి కానీ ఇది మాత్రం హాలీవుడ్ సినిమాల స్థాయిలో అద్భుతమైన గ్రాఫిక్స్ తో తీస్తున్నారు. దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమాపై మూడు ఏళ్లుగా పని చేస్తున్నారు. ఇప్పటికీ అన్ని సెట్ అయ్యాయి.
తాజాగా ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ముందుగా లారా దత్తాపై కొన్ని సీన్లు తీస్తున్నారు. ఆమె దశరథ్ మహారాజా మూడో భార్య కైకేయిగా నటిస్తోంది. ఒకప్పుడు డీడీలో ప్రసారమైన సూపర్ హిట్ “రామాయణం” టీవీ సీరియల్ లో శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్ దశరథ్ మహారాజాగా నటిస్తున్నారు.
లారా దత్తా కైకేయి పాత్రలో ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ సినిమాలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ నటించనున్నారు. రావణాసురుడి పాత్రలో ‘కెజిఎఫ్’ హీరో యష్ నటించనున్నాడు. సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపిస్తారట. ఇక సాయిపల్లవి సీతగా నటించనుంది.
వీరందరూ త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారు. ప్రస్తుతం రాముడి జననం కన్నా ముందు జరిగే కథని తీస్తున్నారు.