శ్రీరామనవమికి సీత లుక్

చాలా నెలలుగా “రామాయణం” సినిమా గురించి చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ రాముడిగా నటించనున్నాడు అనే పుకారుతో ఈ సినిమా గురించి చర్చ మొదలైంది. అనేకమంది హీరోల పేర్లు, హీరోయిన్ల పేర్లు లిస్ట్ లోకి వచ్చాయి. ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రధాన తారాగణం ఇప్పుడు ఖరారు అయింది. సినిమా షూటింగ్ కూడా డేట్ ఫిక్స్ అయింది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తీస్తున్న ఈ భారీ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. సీతగా సాయి పల్లవి నటించనుంది. రావణుడిగా కన్నడ సూపర్ స్టార్ యష్ నటించనున్నాడు.

ఈ నెలలోనే షూటింగ్ మొదలు. ఇక శ్రీరామనవమి నాడు ఈ సినిమాకి సంబంధించిన మొదటి లుక్స్ విడుదల చేస్తారట. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి మొదటి లుక్స్ ఆ రోజు (ఏప్రిల్ 17) వస్తాయి.

సాయి పల్లవి ఇప్పటికే హిందీలో ఒక సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు రెండో చిత్రంగా “రామాయణం”లో కనిపించనుంది.

 

More

Related Stories