సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే మొదటి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్ లు రాస్తున్నారు. “ఆర్ ఆర్ ఆర్” చిత్రానికి కూడా ఆయనే డైలాగ్ లు రాశారు.
ఇక సినిమాకి ముహూర్తం ఒకటి ఫిక్స్ చెయ్యాలి. తాజా సమాచారం ప్రకారం జూన్ మొదటి వారంలో ఈ సినిమాని లాంఛనంగా లాంచ్ చేస్తారట. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభిస్తారు.
మహేష్ బాబు ప్రస్తుతం విదేశాల్లో సేద దీరుతున్నారు. త్వరలో ఇండియాకి వస్తారు. కొన్నాళ్ళూ హైదరాబాద్ లో ఉండి మరో వెకేషన్ కి వెళ్తారట. కానీ అంతకన్నా ముందు రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ తీసుకుంటారట. ఇప్పటికే రాజమౌళి జూన్ నుంచి షూటింగ్ మొదలుపెడదామని హింట్ ఇచ్చారని సమాచారం.
ఈ సినిమాని కూడా రాజమౌళి భారీ ఎత్తున తీయబోతున్నారు. ఇప్పటివరకు తెలుగులో చూడని జాన్రాలో తీస్తారట. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ రచయిత రాసిన నవలల ఆధారంగా ఈ సినిమాని తీయనున్నారు. ఆ నవలల స్పూర్తితో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ని రెడీ చేశారట.