తిక్క భామతో షారుక్ కొడుకు డేటింగ్!

షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ప్రేమ విషయంలో అతను హెడ్ లైన్ అయ్యారు.

షారుక్ ఖాన్ కొడుకు లరిస్సా బొనెసి అనే భామతో డేటింగ్ చేస్తున్నాడు అని బాలీవుడ్ మీడియా కథనాలు. ఇందులో నిజానిజాలు ఎంతో తెలీదు కానీ లరిస్సాతో షారుక్ ఖాన్ కొడుకుని లింక్ చేస్తూ ప్రచారం జరగడమే విచిత్రం.

లరిస్సా బ్రెజిల్ కి చెందిన భామ. ఇండియాలో సినిమా అవకాశాల కోసం వచ్చిన సుందరి. ఈ భామ తెలుగులో సాయి ధరమ్ తేజ్ సరసన “తిక్క” అనే సినిమాలో నటించింది. అలాగే మరో చిన్న చిత్రంలో కూడా కనిపించింది. కానీ ఆమెకి తెలుగులో గుర్తింపు రాలేదు. దాంతో ముంబైలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడే ఉండిపోయింది.

హిందీలో కూడా పెద్దగా అవకాశాలు వచ్చినట్లు లేవు. ఈ అమ్మడికి ప్రస్తుతం 34 ఏళ్ళు. అంటే ఆర్యన్ ఖాన్ కన్నా ఎనిమిదేళ్లు పెద్ద. తనకన్నా వయసులో అంత పెద్ద ఆమెతో ఆర్యన్ డేటింగ్ చెయ్యడం విచిత్రమే.

Advertisement
 

More

Related Stories