‘ఆల్రెడీ హమ్‌నే’పై బోయపాటి రియాక్షన్

“అఖండ 2” సినిమా విడుదలకు ముందు నందమూరి బాలకృష్ణ, బోయపాటి కలిసి ఒక హిందీ యూట్యూబర్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరూ మాట్లాడిన హిందీ మాటలు బాగా వైరల్ అయ్యాయి. బాలయ్యవి కొన్ని ట్రోల్ కాగా బోయపాటి చెప్పిన “‘‘ఆల్రెడీ హమ్‌నే బోల్ దియా.. కాషన్ కియా” అనే మాట బాగా వైరల్ అయింది.
మీమర్స్ దాన్ని ఎక్కువగా వాడుకున్నారు. దీని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో రెస్పాండ్ అయ్యారు.
తనకు వచ్చిన హిందీని మాట్లాడాను అని క్లారిటీ ఇచ్చారు బోయపాటి. భాష మీద కమాండ్ లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఐతే, అందులో ఏం తప్పులేదని అంటున్నారు బోయపాటి.
హిందీలో మాట్లాడుతూనే అందులోనే తెలుగు పదాలు మిక్స్ చెయ్యడం, మధ్యలో బాలయ్యని “ఏమి బాబు” అని అడగడం, దానికి బాలయ్య “అవును” అన్నట్లూ తల ఊపడం బాగా నవ్వు తెప్పించింది. ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటివే ఎక్కువ వైరల్ అవుతాయి.