శంబాల: ఆది కెరీర్లో పెద్ద ఓపెనింగ్

ఆది సాయి కుమార్ కి చాలా రోజుల తర్వాత చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. దానికి తోడు భారీ ఓపెనింగ్ దక్కింది. ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం…‘శంబాల’. ఈ సినిమా నిన్న విడుదల అయింది. విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు నిర్వహించారు. అప్పటి నుంచే పాజిటివ్ మౌత్ టాక్ మొదలైంది.
ప్రీమియర్ల నుంచి మొదలైన పాజిటివ్ టాక్ డే వన్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా కనిపించింది. లిమిటెడ్ స్క్రీన్లలో రిలీజ్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఫుల్ డిమాండ్‌తో దూసుకుపోతోంది.
యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి అంచనాలతోనే ఆడియెన్స్ ముందుకు వచ్చింది. డిమాండ్ పెరగడంతో అన్ని ఏరియాల్లోనూ షోలు, స్క్రీన్‌లను పెంచేశారు. నగరాల్లోని మల్టీప్లెక్స్‌లు మాత్రమే కాకుండా చిన్న చిన్న సెంటర్లలోని సింగిల్ స్క్రీన్లలో సైతం హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.
ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. ఈ సినిమాలో హీరోయిన్ గా అర్చన అయ్యర్ నటించింది.