శిల్పాశెట్టిని టార్గెట్ చేశారా?

ఒకప్పటి అగ్ర హీరోయిన్లలో ఒకరైన శిల్పాశెట్టి ఇటీవల కేసులతో సతమతం అవుతోంది. ఇప్పటికే 60 కోట్ల గోల్ మాల్ కి సంబంధించి ఆమె, ఆమె భర్త ఒక కేసు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు, ముంబైలో ఒక రెస్టారెంట్ తో వచ్చిన ఇబ్బందుల కారణంగా దాన్ని అమ్మేసింది. తాజాగా ఐటీ దాడులు జరిగాయి.
గురువారం ఐటీ అధికారులు ఆమె ఇంటిపై దాడి చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఐతే, శిల్పాశెట్టి లాయర్లు మాత్రం అలాంటిదేమి జరగలేదని నిన్న వివరణ ఇచ్చారు. కానీ ఆమె ఇంటికి అధికారులు విజిట్ చేసిన మాట వాస్తవమే అని మీడియా చెప్తోంది.
చూస్తుంటే రకరకాల కేసులలో శిల్పాశెట్టి, ఆమె భర్త ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. అందుకే, ఆమెని ఎవరో టార్గెట్ చేశారు అనే మాట బాలీవుడ్ లో వినిపిస్తోంది. ఆమెకానీ, ఆమె భర్త కానీ ఎవరో ఒక రాజకీయనాయకుడి ఇగోని తెలిసో, తెలియక హర్ట్ చేసి ఉంటారని, అందుకే ఒకేసారి అనేక కేసులు, ఇబ్బందులు ఆమెని చుట్టుముట్టుతున్నాయని బాలీవుడ్ వర్గాల మాట.
ఐతే, ఆమె భర్త చేసిన తప్పులు, వ్యాపారంలో నైతికత పాటించకపోవడం వల్లే ఇప్పుడు అవి మెడకు చుట్టుకున్నాయి. పోలీసులు, అధికారులు చట్టబద్ధంగా తమ పని చేస్తున్నారు తప్ప ఇందులో రాజకీయ కక్ష లేదు అని మరో వాదన. ఏది ఏమైనా శిల్పాశెట్టికి ఇవన్నీ పెద్ద సమస్యల్లా మారాయి.