వార్ 2: 18 కోట్లు వాపస్

TeluguCinema 26 Dec 2025
NTR in War 2

“వార్ 2” సినిమా అతి దారుణంగా పరాజయం పాలు అయింది. ముఖ్యంగా తెలుగులో సులువుగా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందనే ఉద్దేశంతో నిర్మాత నాగవంశీ సినిమాని కొన్నారు. కానీ అది కేవలం 40 కోట్లు మాత్రం కలెక్ట్ చేసింది. దాంతో నాగవంశీ మొత్తంగా ఆరిపోయారు అని పుకార్లు వచ్చాయి.

తాజాగా ఈ విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. 68 కోట్లు పెట్టి సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారు నాగవంశీ. “వార్ 2″ని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఆ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను నాగవంశీకి అమ్మింది. ఐతే “వార్ 2” రెండు రాష్ట్రాల్లో కలిపి 40 కోట్ల అందుకొంది. పెట్టిన పెట్టుబడికి 28 కోట్లు నష్టం.

“ముంబైకి వెళ్లి యష్ రాజ్ వాళ్లకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళు నాకు తిరిగి 18 కోట్లు ఇచ్చారు. సో నాకు నష్టం అనుకున్నంత జరగలేదు,” అని తాజాగా వివరించారు నాగవంశీ. ఒక పది కోట్లు నష్టం.

ఎన్టీఆర్ తో నాగవంశీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ అభిమానంతోనే ఆయన సినిమాని కొన్నారు. కానీ మొత్తంగా నష్టపోయి దివాళా తీశారు అన్న ప్రచారం నిజం కాదు.