బాధితురాలు భావన ముందుకొచ్చింది

Bhavana Menon

మలయాళ నటుడు దిలీప్ ఇటీవల కిడ్నాప్, బెదరింపుల కేసు నుంచి బయటపడ్డారు. కేరళలోని ఓ కోర్టు దిలీప్ ని నిర్దోషిగా ప్రకటించింది. ఇదే కేసులో ఆరుగురిని దోషులుగా నిర్ధారించింది. దాంతో, దిలీప్ న్యాయం గెలిచిందని, తనను కుట్రపూరితంగా ఇరికించారని తెలిపారు. తన మాజీ భార్య మంజు వారియర్ కావాలనే ఇలా చేసింది అని చెప్పారు.

ఐతే, 2017 నుంచి ఈ కేసు నడుస్తున్నా మీడియా ఆ హీరోయిన్ పేరుని బహిరంగంగా రాయలేదు. “ఒంటరి” వంటి తెలుగు సినిమాల్లో నటించిన భావనని కిడ్నాప్ చేసి మానభంగానికి యత్నం చేసింది ఒక బృందం. ఆ బృందం వెనుక వున్నది హీరో దిలీప్ అనేది కేసు. ఐతే, ఆ బృందానికి తనకి సంబంధం లేదని దిలీప్ వాదించారు. కోర్టు కూడా ఆయన చెప్పినదాంట్లో నిజముందని నిర్దోషిగా ప్రకటించింది.

ఐతే, ఇన్నాళ్లూ మీడియా ఈ కేసు భావన గురించే అని రాయలేదు. మానభంగం వంటి కేసుల్లో విక్టిమ్ పేర్లు మీడియా రాయకూడదు. దాంతో, చాలామందికి ఈ కేసులో బాధిత నటి ఎవరూ అని తెలియలేదు. కానీ ఇప్పుడు భావన స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొంది.

ఈ కేసులో తనకు పూర్తిగా న్యాయం జరగలేదని తెలుపుతూ ఆమె పెద్ద లెటర్ రాసింది. దాంతో, బాధితురాలే స్వయంగా ఇప్పుడు ముందుకొచ్చి తన పేరుని వెల్లడించుకొంది.

More

 

Related Stories