ప్రభాస్ నాన్ స్టాప్ షూటింగ్

Prabhas

ప్రభాస్ గత కొంతకాలంగా ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమా షూటింగ్ తో బిజీ అయిపోతున్నారు. “ది రాజా సాబ్” వచ్చే నెల విడుదల అవుతుంది. సో, ఇక సెట్ మీద రెండు చిత్రాలు ఉన్నాయి. ఒకటి.. ఫౌజీ, మరోటి స్పిరిట్. ఇందులో “ఫౌజీ” షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. దాంతో ఇప్పుడు “స్పిరిట్” షూటింగ్ తో బిజీగా ఉన్నారు ప్రభాస్.

ప్రభాస్ ఇటీవలే జపాన్ నుంచి వచ్చారు. రాగానే “స్పిరిట్” సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఈ డిసెంబర్ 31, జనవరి 1 సంబరాలను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. జనవరి మొదటి వారం వరకు “స్పిరిట్” షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత బ్రేక్ తీసుకుంటారట. కొద్ది రోజులు “ది రాజా సాబ్” ప్రొమోషన్ లలో కూడా ప్రభాస్ పాల్గొంటారు.

మొత్తమ్మీద జనవరిలో బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే, ఈ సారి న్యూఇయర్ సంబరాల కోసం షూటింగ్ క్యాన్సిల్ చెయ్యడం లేదు.

2026లో ప్రభాస్ ఈ రెండు సినిమాలు – స్పిరిట్, ఫౌజీ – పూర్తి చెయ్యాలి. ఆ తర్వాత ఫ్రెష్ గా “కల్కి 2”, “సలార్ 2” మొదలు పెడుతారు.

More

 

Related Stories