
“నాకు ముందు ఏమి లేదు, వెనుక తోక అక్కర్లేదు”
ఇదీ అడివి శేష్ తాజా స్టేట్మెంట్. హీరోలందరికీ తమ పేరు ముందు ఎదో ఒక ట్యాగ్ ఉంది. కానీ ఇప్పటికే చాలా హిట్స్ ఇచ్చిన అడివి శేష్ కి మాత్రం అలాంటివి ఏమి లేవు. ఇదే విషయాన్ని అడిగితే తనకు అలాంటివి అక్కర్లదు అని చెప్పాడు.
చిరంజీవికి మెగాస్టార్, బాలయ్యకి గాడ్ ఆఫ్ మాసెస్, వెంకటేష్ కి విక్టరీ, నాగార్జునకి కింగ్, పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్, మహేష్ బాబుకి సూపర్ స్టార్, ప్రభాస్ కి రెబెల్ స్టార్, అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్, రామ్ చరణ్ కి మెగా పవర్ స్టార్, నానికి నేచురల్ స్టార్, విజయ్ దేవరకొండకి రౌడీ స్టార్, రామ్ కి ఉస్తాద్, రవితేజ కి మాస్ మహారాజ, నాగ చైతన్యకి యువ సామ్రాట్… ఇలా ప్రతి హీరోకి ఒక ట్యాగ్ ఉంది.
అడివి శేష్ మాత్రం తాను అలాంటివి పట్టించుకోను, వాటిని నమ్మను అని అంటున్నాడు.
తాజాగా ఈ హీరో “డెకాయిట్” సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ ఈవెంట్ లో పేరు ముందు ట్యాగ్ ల గురించి ప్రస్తావన తెచ్చారు ఒక జర్నలిస్ట్. “మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆ ట్యాగ్ ఒక్కటి చాలు” అని శేష్ సమాధానం ఇచ్చాడు.





