సమంత ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లే!

Samantha

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ ఒక సినిమా తీయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది. ఐతే, ఆ ప్రకటన కన్నా ముందే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన త్రిష అని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత సమంత పేరుని కూడా పరిశీలిస్తున్నట్లు టాక్ వచ్చింది. ఆ న్యూస్ ఇక్కడ చదవొచ్చు.

తాజా సమాచారం ప్రకారం మెయిన్ హీరోయిన్ గా సమంత పేరుని ఖరారు చేశారట. అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉంది అని సమాచారం.

సమంత, అల్లు అర్జున్ లది హిట్ కాంబినేషన్. వీరు ఇంతకుముందు “సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో కలిసి నటించారు. “పుష్ప” సినిమాలో సమంత “ఊ అంటావా మావా” అనే ఐటెం సాంగ్ చేసింది. అలాగే అట్లీ దర్శకత్వంలో ఆమె ఇంతకుముందు విజయ్ సరసన “పోలీస్” (తమిళంలో “తేరి”), “విజిల్” చిత్రాల్లో నటించింది. అందుకే వీరిద్దరూ సమంతని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు ఉన్నారు.

గత సెప్టెంబర్ లో విడుదలైన “ఖుషి” తర్వాత సమంత మరో సినిమా చెయ్యలేదు. ఇది ఖరారు అయితే ఆమె కెరీర్ మళ్ళీ ట్రాక్ లో పడుతుంది.

Advertisement
 

More

Related Stories