అన్ని ‘G’లే: అంజలి

Anjali

హీరోయిన్ అంజలికిప్పుడు 37 ఏళ్ళు. ఆమె కెరీర్ దాదాపు 17 ఏళ్లుగా సాగుతోంది. “ఫోటో” అనే సినిమాతో ఆమె అడుగుపెట్టింది. ఆ మధ్య ఆమెకి అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. కానీ ఇప్పుడు మళ్ళీ బిజీగా మారింది.

ఈ ఏడాది ఆమె నటించిన మూడు తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి.

“మొదట ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ విడుదల అవుతుంది. వచ్చే నెల ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్, ఆ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ వస్తుంది. ఇది నా సినిమాల ఆర్డర్. అన్ని G అనే లెటర్ తోనే స్టార్ట్ అవుతున్నాయి. అంటే నా గ్రహాలు బాగున్నాయి అన్నమాట,” అని అంజలి అంటోంది.

అన్ని హిట్ అవుతాయని నమ్మకం ఉంది అని చెప్తోంది. ఆమె ఇప్పటివరకు 50 సినిమాల్లో నటించింది.

 

More

Related Stories