మీనాక్షి లైనప్ పెద్దదే!

Meenakshi Chaudhary

“గుంటూరు కారం” సినిమా వల్ల మీనాక్షి చౌదరికి లాభం కన్నా నష్టం ఎక్కువ చేసింది. ఆ సినిమాలో ఆమె మహేష్ బాబు సరసన నటించింది అన్న మాటే కానీ ఆ పాత్ర ఒక జూనియర్ ఆర్టిస్ట్ చెయ్యాల్సినది. అలాగని, ఆమె కెరీర్ ముగిసింది అనుకోవడానికి లేదు.

ఆమె ఈ ఏడాది ఇంకో నాలుగు చిత్రాలు విడుదల చెయ్యనుంది. అందులో ఒకటి బడా చిత్రం. విజయ్ హీరోగా రూపొందుతోన్న తమిళ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” చిత్రంలో ఆమె హీరోయిన్. అది త్వరలోనే విడుదల కానుంది.

ఇక తెలుగులో విశ్వక్ సేన్ సరసన “మెకానిక్ రాకీ” అనే చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. వరుణ్ తేజ్ సరసన “మట్కా” సినిమా చేస్తోంది. దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న “లక్కీ భాస్కర్” అనే మూవీలో మీనాక్షినే హీరోయిన్. ఈ మూడూ మిడ్ రేంజ్ చిత్రాలు. ఈ మూడూ తెలుగు చిత్రాలే. ఇవన్నీ ఈ ఏడాదే (2024) విడుదల అవుతాయి.

అంటే ఈ ఏడాది ఆమె నటించిన 5 చిత్రాలు (“గుంటూరు కారం” కలుపుకొని) వస్తాయి. సో ఆమె లైనప్ చాలా పెద్దగా ఉన్నట్లే.

Meenakshi Chudhary

ఇందులో కొన్ని అయినా హిట్ ఐతే ఆమె కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ మంచి సంపాదన పొందుతోంది ఈ భామ. అందుకే తన కుటుంబం మొత్తాన్ని థాయిలాండ్ కి తీసుకెళ్లింది. వాళ్ళ ఫ్యామిలీకి ఇదే మొదటి ఫారిన్ ట్రిప్పు.

Advertisement
 

More

Related Stories