పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన “”గీత గోవిందం” సంచలన విజయం సాధించింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో “ఫ్యామిలీ స్టార్” వస్తోంది.
ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు పరశురామ్ పై ప్రశంసలు కురిపించారు విజయ్ దేవరకొండ.
“ఫ్యామిలీ స్టార్ నా కెరీర్ లో ఒక ఇంపార్టెంట్ మూవీ. పరశురామ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు మా నాన్న గుర్తుకువచ్చాడు. ఈ సినిమాలో నా పర్ ఫార్మెన్స్ నెక్ట్ లెవెల్ అని పరశురామ్ అంటున్నాడు. కానీ నేను చేసిన పర్ ఫార్మెన్స్ కు మొత్తం క్రెడిట్ పరశురామ్ కే ఇవ్వాలి. ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పరశురామ్. ఆయన లేకుంటే ఫ్యామిలీస్టార్ సినిమానే లేదు. ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా పరశురామ్ కే దక్కుతుంది,” అన్నారు.
పరశురామ్ కథని ఎంటర్ టైనింగ్ గా చెప్పడంలో దిట్ట అని అన్నారు విజయ్.