Advertisement
తెలుగు న్యూస్

షర్ట్ తో బన్నీ సామాజిక చైతన్యం!

ఇటీవల ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ ఫొటోలో బన్నీ వేసుకున్న షర్ట్ పై “స్మోకింగ్ కిల్స్” (ధూమపానం హానికరం) అనే కొటేషన్ ఉంది. వేసుకున్న ఆ షర్ట్, దానిపై ఉన్న ఈ కొటేషన్ వెనుక పెద్ద కథ ఉందని ఆయన టీం చెప్తోంది.

అభిమానులకు, యువతకి ధూమపానం మంచిది కాదు అనే సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ షర్ట్ వేసుకొన్నారట. ఆ ఫోటోని సోషల్ మీడియాలో కావాలనే షేర్ చేశారట. ఎదో క్యాజువల్ గా చేసింది కాదు అని అంటోంది ఆయన టీం. మొత్తానికి ఈ ‘పుష్ప రాజ్’ ఫొటోలతో కూడా సామజిక చైతన్యం కోసం ప్రయత్నిస్తున్నారన్నమాట. మంచి ప్రయత్నమే! బన్నీని మెచ్చుకోవాల్సిందే.

ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని కోటి ఇరవై లక్షల మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్ లో కూడా లక్షలాది ఫాలోవర్స్ ఉన్నారు. సో, అందుకే, ఇలా సోషల్ అవేర్నెస్ మొదలుపెట్టారన్నమాట.

మరోవైపు, ‘పుష్ప’ సినిమా షూటింగ్ ఆగింది. దర్శకుడు సుకుమార్ కి డెంగ్యూ సోకడంతో షూటింగ్ ని నిలిపివేశారు.

Advertisement

This post was last modified on July 26, 2021 10:43 pm

Advertisement
Share