Advertisement
తెలుగు న్యూస్

అమీర్ ఖాన్, కిరణ్ విడాకులు


బాలీవుడ్ అగ్ర నటుడు ఆమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. 15 ఏళ్ల తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ వేస్తున్నట్లు ఇద్దరూ కలిసి ప్రకటన విడుదల చెయ్యడం విశేషం.

అమీర్ ఖాన్, కిరణ్ మధ్య విభేదాలు వచ్చాయని గత కొంత కాలంగా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ఇప్పుడు నిజమైంది. విడిపోవాలని కొన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నామని వారు తెలిపారు. దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకున్నాకే ఇప్పుడు ప్రపంచానికి తెలియచేశారు. ఆమీర్ ఖాన్, కిరణ్ రావుకి ఆజాద్ అనే ఒక కొడుకు ఉన్నాడు.

“భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా మా బంధం కొనసాగుతుంది. ఆజాద్ తల్లితండ్రులుగా మా జీవితాలు పెనవేసుకొని ఉంటాయి,” అని తెలిపారు.

అమీర్ ఖాన్ మొదట తన చిన్ననాటి స్నేహితురాలి రీనాని పెళ్లాడారు. వీరికి ఇద్దరు పిల్లలు జునైద్, ఇరా. ఒక బ్రిటిష్ యువతితో సంబంధం కారణంగా అమీర్ ఖాన్ నుంచి రీనా విడిపోయారు. ‘లగాన్’ సినిమా విడుదలైన తర్వాత ఏడాది వారు డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ‘లగాన్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్ రావుతో ప్రేమలో పడ్డారు అమీర్ ఖాన్. చాలా కాలం సహజీవనం చేసి.. 2005లో ఆమెని పెళ్లాడారు. వీరికి ఆజాద్ పుట్టాడు. 15 ఎళ్ల కాపురం తర్వాత ఇప్పుడు విడిపోతున్నట్టు ప్రకటించారు.

ఆమీర్ ఖాన్ మొదటి కొడుకు జునైద్ ఇప్పుడు హీరోగా అడుగుపెడుతున్నాడు. కూతురు ఇరా చదువు పూర్తి చేసుకొంది. ఆమీర్ ఖాన్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటిస్తున్నారు.

ఆమీర్ ఖాన్ కిప్పుడు 56 ఏళ్ళు.

Advertisement

This post was last modified on July 3, 2021 12:06 pm

Advertisement
Share