Advertisement
తెలుగు న్యూస్

అక్కడ ఆషికీ, ఇక్కడ నగుమోము


‘రాధేశ్యామ్’ సినిమా విషయంలో ఒక వెరైటీ చేశారు మేకర్స్. తెలుగు వెర్షన్ లో ఉన్న పాటలు, హిందీ వెర్షన్ లో ఉండవు. రెండు వెర్షన్ లకు వేర్వేరు సంగీత దర్శకులు పని చేశారు. పాట అదే… నటులు వాళ్ళే…డ్యాన్స్ అదే… కానీ రెండు భిన్నమైన ట్యూన్స్. ఇదో కొత్త పంథా.

డిసెంబర్ 1న ‘ఆషికీ ఆ గయీ’ అనే హిందీ పాట విడుదల కానుంది. ఈ పాటకు మిథూన్ సంగీతం అందించగా, అర్జిత్ సింగ్ పాడాడు. ఇక అదే సిట్యువేషన్ కి తెలుగులో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.

“నగుమోము తారలే…” అంటూ తెలుగులో ఈ పాట సాగుతుంది. సిద్ శ్రీరామ్ ఈ పాటని తెలుగులో పాడారు. తెలుగు ట్యూన్ తమిళ, కన్నడ, మలయాళం వెర్షన్స్ కి వాడుతున్నారు. సముద్రపు తీరంలో తీసిన ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు.

‘రాధేశ్యామ్’పై అనేక పుకార్లు ఉన్నాయి. నాలుగేళ్లుగా సాగుతూ వస్తున్న ఈ సినిమా క్వాలిటీపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఐతే, ఈ పాట మాత్రం చాలా రిచ్ గా కనిపిస్తోంది. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది ‘రాధేశ్యామ్’.

Advertisement

This post was last modified on November 29, 2021 10:27 pm

Advertisement
Share