Advertisement
తెలుగు న్యూస్

కలిసి ఫోటో దిగేది లేదు!

అదితి రావు, సిద్ధార్థ్ ప్రేమికులు అని కొత్తగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. 44 ఏళ్ల సిద్ధార్థ్, 37 ఏళ్ల అదితి రావు తమ ప్రేమ వ్యవహారాన్ని ఇంకా బహిరంగంగా చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నారు. ఇద్దరూ అన్ని చోట్లకు కలిసే వెళ్తున్నారు. కానీ, కెమెరా ముందు కలిసి వచ్చేందుకు ఇష్టపడడం లేదు.

తాజాగా అదితి రావు, సిద్ధార్థ్ ముంబై ఎయిర్పోర్ట్ వద్ద ఫోటోగ్రాఫర్ కంటపడ్డారు. ఫోటోగ్రాఫర్ లను చూడగానే ఇద్దరూ విడివిడిగా బయటికి వచ్చారు. సిద్ధార్థ్ ముందు బయటికి వచ్చి తన కారు ఎక్కారు. ఆ తర్వాత కాసేపటికి అదితి వచ్చింది. ఇద్దరు కలిసి ఫోటో దిగితే బాగుంటుంది కదా అని ఫోటోగ్రాఫర్ లు అడిగితే… నవ్వుతూ “నో” అంటూ అదితి తప్పించుకొంది.

అదితి రావు ఇంతకుముందే పెళ్లి అయింది. భర్తతో విడాకులు తీసుకొని కూడా దశాబ్దం గడిచింది. ఇక సిద్ధార్థ్ పలువురు హీరోయిన్లతో సహజీవనం చేశారు. ఇప్పుడు అదితి రావుతో సహజీవనం చేస్తున్నాడు.

వీరు కలిసి ఉంటున్న విషయం అందరికీ తెలుసు. కానీ, ఇద్దరూ మీడియా ఫొటోగ్రాఫర్ల ముందుకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. దానికి కారణమేంటో వాళ్ళకే తెలియాలి.

Advertisement

This post was last modified on June 4, 2023 12:43 pm

Advertisement
Share