Advertisement
తెలుగు న్యూస్

ఓటిటిలో కొత్త ‘ఏజెంట్’!

అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ ఫలితం చూసి షాక్ అయ్యాడు అఖిల్. పూరి తీసిన ‘లైగర్’తో విజయ్ దేవరకొండ ఎలా డీలాపడ్డాడో, ‘ఏజెంట్’తో అఖిల్ కూడా అదే ఫీల్ అయ్యాడు. ఐతే, ఈ సినిమాని విడుదలకు ముందే భారీ మొత్తానికి ఓటిటికి అమ్మేశారు.

కానీ, ఇప్పుడు ఓటిటి సంస్థలు కూడా మేకర్స్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. మీరు తీసే బోరింగ్ సినిమాలకు ఇకపై అంత అంత రేట్లు ఇవ్వమంటున్నాయి. కనీస ప్రమాణాలు పాటించాల్సిందే అని చెప్తున్నాయి. తర్వాత సినిమాలపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ‘ఓటిటి’ కోసం మళ్ళీ ఎడిటింగ్ ప్యాట్రన్ మార్చి విడుదల చేస్తున్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పుడు ఆ పనిలో ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే ఏమి చేసినా ఈ సినిమా ‘స్వరూపం’ మారదు. కథలోనే సమస్య ఉంది. కథనం ఇంకా కంగాళీ. కొన్ని సీన్లు మార్చితే ఏమి లాభం.

ఐతే, కొంత నిడివి తగ్గే అవకాశం ఉంది. ‘ఏజెంట్’ని కొన్న ఓటిటి సంస్థ ఇప్పటికే తెలుగునాట సబ్ స్క్రయిబర్ లు లేక లబోదిబోమంటోంది. ఇపుడు ఇది పెద్ద బర్డెన్.

Advertisement

This post was last modified on June 5, 2023 10:20 am

Advertisement
Share