Advertisement
తెలుగు న్యూస్

అక్కడ ఆఫర్లు కొట్టేస్తోన్న ఐశ్వర్య

తెలుగులో ఐశ్వర్య రాజేష్ మెయిన్ హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. రెండో హీరోయిన్ గానో, హీరోకి మరదలుగానో మాత్రమే కనిపించింది. ‘రిపబ్లిక్’ వంటి సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించినా… ఆ పాత్ర చిన్నది. తెలుగులో ఆమెకి ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు.

కానీ తమిళంలో మాత్రం ఐశ్వర్య రాజేష్ కి పెద్ద హీరోల సరసన కూడా అవకాశాలు వస్తున్నాయి.

హీరో సూర్య నిర్మిస్తున్న కొత్త సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా ఖరారు అయింది. దర్శకుడు బాల తీసే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మెయిన్ హీరోయిన్. హీరోగా గెస్ట్ పాత్రలో సూర్య కనిపిస్తారట.

ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయే. కానీ పుట్టింది చెన్నైలోనే. పేరు వచ్చింది అక్కడే. ఇప్పుడు అవకాశాలు కూడా అక్కడే ఎక్కువగా వస్తున్నాయి. తెలుగులో చిన్న చిన్న పాత్రలు ఇక చెయ్యను అని తేల్చిచెప్పింది.

Advertisement

This post was last modified on October 19, 2021 7:54 pm

Advertisement
Share