Advertisement
తెలుగు న్యూస్

అలియాని ఇంట్లో బంధించారట


వచ్చే వారమే అలియా భట్ పెళ్లి. తన ప్రియుడు రణబీర్ కపూర్ ని పెళ్లాడనుంది. పెళ్లికి ముందు ఆమె బయటికి అడుగుపెట్టకుండా ఇంట్లోని బంధించారట ఆమె కుటుంబ సభ్యులు. దానికి కూడా కారణం ఉంది.

అలియా భట్ ఇప్పుడు బయటికి అడుగుపెడితే మీడియా వెంట పడుతుంది. కెమెరా చూపులు వెంటాడతాయి. కరోనా భయం కూడా ఉంది. అందుకే, ముందు జాగ్రత్త చర్యగా ఆమెని ఇంట్లోనే ఉంచారట. అలియా భట్, రణబీర్ కపూర్ ఇప్పటివరకు తమ పెళ్లి గురించి ఇంకా అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఐతే, మీడియా కెమెరాలు అన్ని అలియా భట్ ఇంటివద్ద, రణబీర్ ఇంటివద్ద పాతుకుపోయాయి.

అలియా భట్, రణబీర్ కపూర్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు వీరి పెళ్ళికి ఒప్పుకొని చాలా కాలమే అయింది. కానీ, వీరి సినిమాల కమిట్ మెంట్స్ వల్ల ఇన్నాళ్లూ ఇద్దరూ వెయిట్ చేశారు.

పెళ్లి తర్వాత కూడా అలియా నటించనుంది. ఆమె ఇప్పటికే నాలుగు, ఐదు కొత్త చిత్రాలు సైన్ చేసింది. వీరిద్దరూ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ కూడా ఈ ఏడాదే విడుదల కానుంది.

Advertisement

This post was last modified on April 9, 2022 7:23 pm

Advertisement
Share