Advertisement
తెలుగు న్యూస్

ఐకాన్ లైన్లో పెట్టిన ఐకాన్ స్టార్


‘ఐకాన్’ సినిమా మొదలు కాకముందే తనకున్న ‘స్టయిలీష్ స్టార్’ అనే పేరుని ‘ఐకాన్ స్టార్’గా మార్చేశాడు అల్లు అర్జున్. మరి అలాంటప్పుడు ‘ఐకాన్’ సినిమా మొదలుపెట్టక పొతే ఎలా? ఇప్పుడు అదే పనిలో ఉన్నాట్ట అల్లు అర్జున్. ‘పుష్ప’ షూటింగ్ పూర్తి కాగానే ‘ఐకాన్’ మొదలవుతుంది.

ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నారు. విదేశాల్లో తీద్దామనుకున్న సన్నివేశాలను కూడా ఇక్కడే చిత్రీకరించనున్నారు. ఎందుకంటే… రెండో దశ కోవిడ్ వల్ల ఫారీన్ కంట్రీస్ కి వెళ్లి షూటింగ్ చెయ్యడమే రిస్క్.

‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు తీసే ‘ఐకాన్’ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఈ సినిమా ఉంటుంది.

అల్లు అర్జున్ ఈ సినిమాని స్పీడ్ గా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే, ఈ సినిమా స్క్రిప్ట్, ఇతరత్రా పనులు ఇంతకుముందే పూర్తి అయ్యాయి.

Advertisement

This post was last modified on July 8, 2021 3:13 pm

Advertisement
Share