Advertisement


సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో నటి అనసూయపై కామెంట్స్ చేశారట. అద్భుతంగా నటిస్తుంది కానీ పెళ్ళైన ఆమె అలాంటి పొట్టి డ్రెస్సులు వేసుకోవాలా అన్నట్లుగా ఎదో మాట్లాడారట. దాంతో అనసూయ స్పందించారు.

“ఒక సీనియర్ నటుడు నేను వేసుకునే దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. అంతటి నటుడు అంత తక్కువ స్థాయి మాటలు మాట్లాడడం శోచనీయం,” అంటూ పెద్ద లెటర్ పెట్టారు. దాంతో, కోట అభిమానులు కూడా ఆమెకి కామెంట్స్ పెట్టారు. “ఆయన మీ నటన గురించి కూడా పొగిడారు. నాకు నచ్చనిది అదొక్కటే అని మాత్రమే అన్నారు కానీ డ్రెస్సింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదు,” అని నెటిజెన్స్ అనసూయకి తెలిపారు.

అలాగే, ఆయన వయసుని గౌరవించి ఆయనని తప్పుపట్టకండి అని కూడా సలహా ఇచ్చారు. ఐతే, అనసూయ మాత్రం తగ్గలేదు.

“పాపం ముసలాయన.. పాపం పెద్దాయన…. పాపం ఎదో తేలిక.. సీన్ చెయ్యకండి వంటివి నాకు చెప్తున్నారు. మరి ఆయన అన్న మాటలు గురించి మాట్లాడారే,” అని అనసూయ మరో ట్వీట్ చేశారు.

కోట గారిని నటుడిగా అభిమానిస్తాను, గౌరవిస్తాను కానీ ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఘోరం అని అనసూయ ఫైనల్ గా తేల్చారు.

Advertisement

This post was last modified on October 18, 2021 7:29 pm

Advertisement
Share