Advertisement
తెలుగు న్యూస్

భర్తతో అనసూయ వీడియో వైరల్

అనసూయ వెకేషన్ లో ఉన్నారు. ఆమె భర్తతో కలిసి థాయిలాండ్ లో టూర్ లో ఉన్నారు. ఈ రోజు వారి పెళ్లి రోజు. వెడ్డింగ్ యానివర్సరీని సెలెబ్రేట్ చేసుకునేందుకు వాళ్ళు ఈ బీచ్ ప్లేస్ కి వెళ్లారు.

ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఎందుకంటే ఈ వీడియోలో ఆమె బికినీలో దర్శనమివ్వడం విశేషం. అలాగే తన భర్తతో ఇంటిమేట్ గా ఉన్న దృశ్యాలు కూడా ఉన్నాయి.

అనసూయ, ఆమె భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల అనసూయ విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసి రచ్చ సృష్టించారు. ఆ వివాదం తర్వాత ఆమెకి ఫాలోవర్స్ కూడా కొంత తగ్గారు.

ఐతే, అనసూయ మాత్రం విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేసే విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ఆమె ప్రస్తుతం ‘పుష్ప 2’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన ‘విమానం’ ఈ నెల 9న థియేటర్లలోకి రానుంది.

Advertisement

This post was last modified on June 4, 2023 1:49 pm

Advertisement
Share