Advertisement
తెలుగు న్యూస్

బాలయ్య కోసం వెయిట్ చేస్తాడట


నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్న విషయం మనకు తెలుసు. ‘క్రాక్’ దర్శకుడు మలినేని బాలయ్యతో సినిమాని వచ్చేనెల మొదలుపెడుతారు. దసరా కానుకగా సినిమాని విడుదల చెయ్యాలనేది ప్లాన్. ఆ తర్వాతే బాలయ్య మరో సినిమా స్టార్ట్ చేస్తారు.

అంటే దర్శకుడు అనిల్ రావిపూడికి ఇంకా గ్యాప్ పెరుగుతుంది. ఇప్పటికే బాలకృష్ణతో తన కథని ఓకే చేయించుకున్నారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా “ఎఫ్ 3” తీస్తున్నారు రావిపూడి. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. కానీ షూటింగ్ మాత్రం ఫిబ్రవరిలోనే పూర్తి అవుతుంది. ఆ తర్వాత దాదాపు ఎనిమిది, తొమ్మిది నెలలు ఆయన ఖాళీగా ఉండాలి. బాలయ్య కోసం వెయిట్ చెయ్యక తప్పదు.

‘అఖండ’ తర్వాత నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ రేంజ్ పెరిగింది. జనం ఆయన నుంచి ఎక్కువ యాక్షన్ ఆశిస్తున్నారు. సో… అనిల్ రావిపూడి కూడా అలా స్క్రీన్ ప్లే మార్చుకోవాలి. ఈ దర్శకుడు ఎంటర్ టైన్మెంట్ చిత్రాలకు పెట్టింది పేరు. ఐతే, బాలయ్యతో కామెడీ సినిమా తీయను అని ఇప్పటికే రావిపూడి క్లారిటీ ఇచ్చారు. పక్కా మాస్ సినిమానే తీయబోతున్నాడట.

బాలయ్యని బోయపాటి ఎలా కొత్తగా చూపించాడో, తాను కూడా అలా చూపించేందుకు కొంత కసరత్తు చెయ్యాల్సి ఉంటుందని చెప్తున్నారు అనిల్.

Advertisement

This post was last modified on December 25, 2021 10:43 pm

Advertisement
Share