Advertisement
తెలుగు న్యూస్

కుర్ర లవర్ తో ట్రిప్పు

మలైక అరోరా, అర్జున్ కపూర్ మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే చాలా ఏళ్లుగా వీరి మధ్య సహజీవనం సాగుతోంది. ఆమె 20 ఏళ్ల కొడుకు కూడా వీరి బంధాన్ని అర్థం చేసుకున్నాడట.

కొడుకు విదేశాల్లో చదువుకుంటుండగా, ఆమె తన కుర్ర ప్రేమికుడితో కలిసి యూరోప్ ట్రిప్పు వేసింది. యూరోప్ లో వివిధ అందమైన పర్యాటక ప్రదేశాలు తిరుగుతూ అక్కడి నుంచి తమ ఫోటోలను షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు షేర్ చెయ్యడం ద్వారా ఇటీవల తమ విషయంలో షికారు చేసిన పుకార్లకు ఆమె అడ్డుకట్ట వేసింది అని చెప్పొచ్చు.

49 ఏళ్ల మలైక అరోరా మరోసారి గర్భవతి అయింది అనేది ఒక పుకారు. అలాగే పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుండడంతో విసిగిపోయిన అర్జున్ కపూర్ ఆమెకి టాటా బైబై చెప్పాడు అనేది మరో పుకారు. ఈ రెండూ తప్పే అని ఈ యూరోప్ ట్రిప్పుతో మలైక ప్రూవ్ చేసింది.

వారి మధ్య అనుబంధం అలాగే ఉంది. ఐతే, పెళ్లి మాత్రం చేసుకోకపోవచ్చు అని అంటున్నారు. అతనికి 37 ఏళ్ళు. ఈ ఏడాది అక్టోబర్లో ఆమె 50వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటుంది.

Advertisement

This post was last modified on April 19, 2023 3:36 pm

Advertisement
Share